హీరోలకు ధీటుగా అనుష్క - Anushka Is Equal to Heros
గ్లామరస్ హీరోయిన్ అనుష్క మహిళాప్రాధాన్యత పాత్రలలో అద్బుతంగా నటిస్తూ హీరోలకు ధీటుగా నిలుస్తోంది. ప్రముఖ నటీమణులు శారద, విజయశాంతి తరువాత స్త్రీ ప్రాధాన్యత గల పాత్రలలో అంతటి స్థాయిలో అనుష్క రాణిస్తోంది. అత్యంత ప్రతిభావంతంగా నటిస్తూ ప్రతి పాత్రకు జీవం పోస్తోంది. అంతేకాకుండా అందాలను ఆరబోస్తూ యువతకు పిచ్చెక్కిస్తోంది. గ్లామరస్ గా కనిపించడంలోనే కాకుండా నటనలో కూడా తన ప్రతిభ చూపి అందరినీ మెప్పిస్తోంది. ఎన్నో రకాల వైవిద్యమైన పాత్రలలో నటిస్తూ అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనుష్క కే చెల్లింది.
ఈ యోగ బ్యూటీ ఇటీవల నటించే చిత్రాలన్నీ భారీవే. ప్రధాన పాత్రగా వర్ణ లాంటి భారీ సినిమా వచ్చింది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో తెలుగు తమిళ భాషలలో దీనిని నిర్మించారు. ఇప్పుడు మరో భారీ చిత్రం రాణి రుద్రమ రానుంది. ఇంకో భారీ చిత్రం 'బాహుబలి'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన 'బహూబలి' కోసం అనుష్కను ఏరికోరి ఎంపిక చేసుకున్నారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాజమౌళి 'బాహూబలి'ని రూపొందిస్తున్నారు. మరో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 'రుద్రమదేవి' చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు చారిత్రక కథాంశాలతో రూపొందడం ఒక విశేషమైతే. ఈ రెంటిలో అనుష్క ప్రధాన పాత్రలు పోషించడం మరో విశేషం. అంతేకాకుండా కథలపరంగా అవసరం ఉన్నందున ఈ సినిమాల కోసం ఈ అందాల భామ కత్తియుద్దం, గుర్రపుస్వారీల వంటివి నేర్చుకుని హీరోలకు ధీటుగా నటిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ దర్శకులు - కథాబలం - నటన పరంగా ప్రాధాన్యం - భారీ చిత్రాలు కావడంతో అనుష్క రుద్రమదేవి,బాహుబలి సినిమాలకు ప్రధాన్యత ఇచ్చి పలు ఇతర సినిమాలను వదులుకున్నారు.