Hero Sudeep in Telugu Remake film attarintiki daredi movie - సుదీప్ అత్తారింటికి దారేది
Hero Sudeep in Telugu Remake film attarintiki daredi movie - సుదీప్ అత్తారింటికి దారేది
కన్నడ అగ్రశ్రేణి నటుడు సుదీప్ కు దక్షిణాది అంతటా అభిమానులున్నారు. పాత్ర నచ్చితే ఏ భాషలో అయినా నటించడానికి, ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సుదీప్ సిద్ధం. ప్రస్తుతం తెలుగులో ' బాహుబలి ', తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారాయన. ఇతర భాషల్లో ఎంత బిజీగా ఉన్నా... కన్నడ సీమలో మాత్రం సుదీప్ సూపర్ స్టార్. తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేసి అక్కడ విజయాలు అందుకోవడంలో కూడా సుదీప్ దిట్ట.ప్రభాస్ 'మిర్చి' సినిమా కన్నడంలో సుదీప్ హీరోగా రీమేకై అక్కడ మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఆ విజయం తాలూకు ఆనందంలో తేలియాడుతున్నారు సుదీప్. ఇదే జోష్ లో మరో రీమేక్ కి కూడా ఆయన పచ్చ జెండా ఊపేశారు. తెలుగులో రికార్డులు తిరగరాసిన ' అత్తారింటికి దారేది ' సినిమాను కన్నడంలో ఆయన చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలుపుతానని సుదీప్ చెప్పారు.