Making fruit Kesari recipe - Fruit Kesari cooking method - Cooking Recipes
Making Fruit Kesari recipe - Fruit Kesari cooking method in Telugu
ఫ్రూట్ కేసరి :
కావలసినవి :
రవ్వ : ఒక కప్పు
పంచదార : ఒక కప్పు
అన్ని రకాల పండ్ల ముక్కలు : ఒక కప్పు
నెయ్యి : 4 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు :టేబుల్ స్పూన్
యలకల పొడి : అరటీస్పూన్
కేసరి రంగు: చిటికెడు
తయారుచేసే విధానం :
*బాణలిలో టీస్పూన్ నెయ్యి వేసి జీడి పప్పు, ఎందు ద్రాక్ష వేయించి తీయలి.
*అదే బాణలిలో మరో టీస్పూన్ నెయ్యి వేసి పండ్ల ముక్కలు వేసి సిమ్ లొ రెండు నిముషాలు వేయించి తీయాలి. తరువాత మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి రవ్వ వేయించి తీయలి.
* మందపాటి బాణలిలో మూడు కప్పుల నీళ్ళు పోసి మరిగిన తరువాత పంచదార వేసి కలపాలి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసి మిగిలిన నెయ్యి, పండ్ల ముక్కలు వేసి కలుపుతూ వుదికించలి. అవి పూర్తిగా కలసిన తరువాత యలకల పొడి, వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి దించలి.
ఇప్పుడు మీ నోరూరించే తియ్యతియ్యని ఫ్రూట్ కేసరి రెడీ